28, జూన్ 2025, శనివారం

Title : Ennenno janmala Movie: Pooja Singers: S.P. Bala Subramanyam గారు , Vani Jayaram గారు Lyricist: Composer: Raajan Nagendran గారు Director: Murugan Kumaran గారు

 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది

పున్నమి వెన్నెలలోన పొంగును కడలి... నిన్నే చూసినవేళ నిండును చెలిమి
నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చెరనా..చెరనా...
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది

విరిసిన కుసుమము నీవై మురిపించేవు.. తావి నేనై నిన్ను పెనవేసేను
మేఘం నీవై  నెమలిని నేనై ఆశతొ నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా..
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది

కోటి జన్మలకైన కోరేదొకటే.. నీలొ సగమై ఎపుడు నేనుండాలి
నీవున్నవేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ..

ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది...
ఎన్నటికి ఎన్నటికి మాయని మమతా నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను