UGC New Rules: ఇప్పటి వరకు ఒక కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కావాలంటే ఏదైనా సబ్జెక్టులో NET పరీక్ష పాసై లేదా PhD చేసి ఉండాలి. కానీ UGC (యూనియన్ గ్రాంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా) ప్రొఫెసర్ నియామకానికి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించబోతోంది. నెట్, పీహెచ్ డీ లేకుండానే ప్రొఫెసర్లను నియమించే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో దీనిపై యూజీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రాక్టీస్ ప్రొఫెసర్
ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యూజీసీ కొత్త నిబంధనలను రూపొందించింది. అధికారిక అర్హత పరీక్ష (NET- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) లేదా PhD అవసరం లేదు. ఈ రకమైన రిక్రూట్‌మెంట్‌కు ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా పేరు పెట్టారు. ఈ విధంగా 10% ప్రొఫెసర్లను రిక్రూట్ చేసుకోవచ్చు. POP ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
ఏయే సబ్జెక్టుల్లో రిక్రూట్‌మెంట్
UGC కొత్త నిబంధనల ప్రకారం.. ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ (POP) కింద సైన్స్, ఇంజనీరింగ్, మీడియా, సాహిత్యం, సాంఘిక శాస్త్రం, ఫైన్ ఆర్ట్స్, సాయుధ దళాలు, సివిల్ సర్వీసెస్ వంటి అంశాలలో ప్రొఫెసర్లను నియమించుకుంటారు.
ఎవరు అర్హులు
ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (POP) పోస్టుకు కనీసం 15 సంవత్సరాలు కళాశాలలో బోధించిన వారు అర్హులు. మీరు చాలా కాలంగా ఒక సబ్జెక్టును బోధిస్తూ దానిపై మాస్టర్స్ ఉంటే ప్రాక్టీస్ ప్రొఫెసర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
POP నమూనా ఇప్పటికే చాలా చోట్ల అమలు అవుతుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), హార్వర్డ్ యూనివర్శిటీ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌లు ప్రాక్టీస్ (POP) కింద తీసుకున్నారు. భారతదేశంలో కూడా POP మోడల్ IITలలో నడుస్తుంది. IIT ఢిల్లీ, గౌహతి, మద్రాస్‌లో ఈ విధంగా ప్రొఫెసర్‌లను నియమించుకుంటున్నారు. కానీ ఇప్పుడు POP మోడల్ ఇంజనీరింగ్ కాకుండా ఇతర సబ్జెక్టులలో అమలుకాబోతుంది.
disclaimer
REFER THE LATEST RULES
రిప్లయితొలగించండిUGC,CENTRAL GOVT OF INDIA