25, మే 2023, గురువారం

OUR ATTEMPTS TO RESHAPE OTHERS MAY PRODUCE CHANGE, BUT THE CHANGE IS DISTORTION RATHER THAN TRANSFORMATION.” reviewed , Mr ram . a. dayinaboyina

 నాకు ఏది అవసరమో నీకూ అదే అవసరం కానపుడు దయచేసి నాకవసరమైనది తప్పు అని నాకు చెప్పకు.

నా నమ్మకాలు నీ నమ్మకాలకంటే వేరుగా ఉన్నపుడు దయచేసి నా నమ్మకాలను సరి చేయాలని నీవనుకోకు.
నా భావోద్వేగాలు నీకంటే తక్కువ రకంగానూ తక్కువ తీవ్రంగానూ నీకనిపిస్తే.. దయచేసి నా ఉద్వేగాలు నీ ఉద్వేల్లాగే ఉండాలని చెప్పకు.
క్షణం కూడా నేను నన్ను మార్చమని నిన్ను అడగలేదు.
నన్ను సేమ్ నీ మరో కాపీలాగా మార్చుకోవాలని నేను అడగనంత వరకు దయచేసి నీవు నన్ను మార్చేయాలని తలపోయకు.
నా కోరికలు, భావోద్వేగాలు, నమ్మకాలు, ప్రవర్తనలు నీకు నచ్చకపోతే నీవు చేయవలసిన మొదటిపని నీకు నీవుగా తెలివి తెచ్చుకోవలసినదేమంటే.. అవి నీకు తప్పుగా అనిపించినవన్ని నాకు ఒప్పుగానే అనిపిస్తున్నాయని.
నన్ను నాలాగా ఉండనీయడమే నన్ను అర్థం చేసుకోవడమని.
నీవు నా తీరు చూసి బాధపడిపోవచ్చు.. తప్పుగా బతికేస్తున్నానని అసహనంగా తయారవచ్చు.. కానీ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలెట్టినప్పుడే నేను నీకంటే ఎంత విభిన్నంగా ఉన్నానో చూసి ఆశ్చర్యపోవడం నీవు మొదలుపెడతావు.
నన్ను మార్చేయాలని అనుకునే సుదీర్ఘ ప్రయత్నాలకంటే నీతో నాకున్న వైవిధ్యాన్ని చూసి ఆనంద పడతావు. ముచ్చటపడిపోతావు.
నేను నీ భర్తను కావచ్చు.. భార్యను కావచ్చు, తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు.. బిడ్డను కావచ్చు.. నీ స్నేహితుడని కావచ్చు.. నీ సహోద్యోగిని కావచ్చు.. మన మధ్య సంబంధం ఏదైనా కావచ్చు..
కానీ నాకు తెలిసిన సత్యమేమంటే...
నీవూ నేనూ ఇద్దరమూ ఫండమెంటల్లీ ఒకరికొకరం వేరు వేరు. ఎవరి జీవితాలను వారిమి జీవించవలసి ఉంటుంది.
విభిన్నత ఉంటుందని నీవు తెలుసుకోకపోవడం నీ సమస్యే తప్ప నాది కాదు.
An excerpt from book "please understand me" By David Keirsey.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి