2, ఫిబ్రవరి 2025, ఆదివారం

TELUGU MADHURYAM .....................ప్రియా..మహాశయా .. లయా.. చూపవేలా..దయా.. చెలీ మనోహరీ సఖీ మాధురి హృదయా... స్వయంవరా..

 ప్రియా..మహాశయా .. లయా.. చూపవేలా..దయా..

చెలీ మనోహరీ సఖీ మాధురి హృదయా...
స్వయంవరా..
ప్రియం కదా..
మాటే రానీ..మౌనం హాయిలో..
ప్రియా..మహాశయా .. లయా.. చూపవేలా..దయా..

చెలీ మనోహరీ సఖీ మాధురి హృదయా...


తొలీ..తొలీ..బులబాటమేదో...తొలకరిస్తుంటే..
అదే ..కథా..కదా..
ముఖాముఖీ ..మొగమాటేమేదో..మొలకరిస్తుంటే..
ఇదే పొదా..పదా..

శృతి కలిసే .. జతై .. ఇలాగే
మైమరిచే..క్షణాలలో..
ఎద సొదలే...కథా కళీలై..
జతులడిగే...జ్వరాలలో..
చిలక ముద్దులకు .. అలక పాన్పులకు
జరిగిన రసమయ .. సమరంలో..

చెలీ మనోహరీ సఖీ మాధురి హృదయా...
ప్రియా..మహాశయా ..లయా.. చూపవేలా..దయా..


మరీ ..మరీ..మనువాడమంటూ..మనవి చేస్తుంటే..
శుభం..ప్రియం ..జయం..
ఆదా ..ఇదా..తొలిరేయి
అంటూ..అదుముకొస్తుంటే..
అదో రకం ..సుఖం..
చెరిసగమై .. మనం ఇలాగే..
పెదవడిగే..మజాలలో..
రుచి మరిగీ..మరీ ..ప్రియంగా
కొసరడిగే..నిషాలలో...
ఒకరి హద్దులను..ఒకరు వద్దు అను
సరసపు సరి సరిహద్దులలో..

ప్రియా..(ఆ) మహా.(ఆ)..శయా (ఆ)
లయా.. చూపవేలా..దయా..
చెలీ (ఆ)మనో (ఆ)హరీ (ఆ)
సఖీ మాధురి హృదయా...
స్వయంవరా..
ప్రియం కదా..
మాటే రానీ..మౌనం .హాయిలో..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి