HTML నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికోసం, సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో సహా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు పూర్తి ట్యుటోరియల్స్ను మహిగ్రాఫిక్స్ అందిస్తోంది. మీరే సొంతంగా వెబ్పేజీలను తయారు చేస్కోవడానికి ఈ ట్యుటోరియల్స్ మీకు ఉపయోగపడతాయి. HTML సబ్జెక్ట్లోని ప్రతి అంశంపై ఒక్కో ట్యుటోరియల్ ఒక్కో పోస్టు రూపంలో ఇక్కడ ప్రచురించబడుతుంది. కొత్తగా ప్రచురించబడిన ప్రతి పోస్టు, పాత పోస్టుకు లింకు చేయబడుతుంది. ఏదైనా పోస్టులో మీకు సందేహం ఉంటే వెంటనే ఆ పోస్టు క్రింద ఉన్న క్విక్ రిప్లై బాక్స్లో డైరెక్ట్గా మీ సందేహాన్ని టైపు చేసి తెలియజేయవచ్చు.
HTML నేర్చుకుంటే నాకేంటి?
మీరు మహిగ్రాఫిక్స్ ఫోరమ్లోకి ప్రవేశించి, ఇక్కడ ఈ పోస్టు చదువుతున్నారూ అంటే, ఇంటర్నెట్ పై ఎంతో కొంత అవగాహన ఉండబట్టే మీరు ఈ ట్యుటోరియల్లోకి రాగలిగారు. మీలో కొంతమందికి సొంత వెబ్సైట్లు, బ్లాగులు ఉండి ఉండవచ్చు. కానీ మీ వెబ్సైట్/బ్లాగును మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేయడం మీకు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఈ ట్యుటోరియల్స్ ఉపయోగపడతాయి. కేవలం HTML నేర్చుకుంటే మా బ్లాగులను ఎడిట్ చేయగలమా? అందులో ఉండేది xml కోడ్ కదా? అనే సందేహం కూడా మీకు రావచ్చు. దానికి సమాధానం: xml, php ఇలా డైనమిక్ వెబ్ పేజీలకు ఉపయోగించే ఏ కోడ్లో అయినా అంతర్గతంగా HTML ట్యాగులు, ఎలిమెంట్స్ ఎంబెడ్ అయి ఉంటాయి. కాబట్టి HTML కోడ్ నేర్చుకోవడం వలన నష్టమేమీ లేదు. అంతా లాభమే. HTML కోడ్ మీద అవగాహన ఉన్న వారికి ఇతర కోడ్స్ సులభంగా అర్ధమవుతాయి.
HTML గురించి క్లుప్తంగా:
వెబ్ పేజీలలో పేరాలు, జాబితాలు, పదాలును మార్క్ చేసి, కొన్ని ట్యాగ్లనుపయోగించి బ్రౌజర్కు అనుగుణంగా వాటి ప్రవర్తనను మార్చడానికి HTML (హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్) ను ఉపయోగిస్తారు. HTML అనేది చాలా సంవత్సరాలనుండీ ఉపయోగిస్తున్నదేమీ కాదు. 25, నవంబర్, 1995 నాడు మొట్టమొదటి వెబ్ పేజీ ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేయబడింది. ఈ వెబ్ పేజీ పూర్థి స్థాయి HTML ప్రామాణికంగా ఉండేది కాదు. తర్వాత World Wide Web Consortium (W3C) అనే గ్రూపు HTML ను డెవెలెప్ చేసి ప్రపంచ స్థాయి ప్రామాణికాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది.
Web Pages గురించి క్లుప్తంగా:
వెబ్ పేజీని ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో, సులభంగా మీ సమాచారాన్ని ఒకేసారి ఎక్కువమందికి చేరవేయవచ్చు. మీ వ్యాపారాన్ని మార్కెట్ చేయగలిగే వేదికగా వెబ్ పేజీని ఉపయోగించవచ్చు. మీ వ్యక్తిగత వెబ్ సైట్ ద్వారా ప్రపంచానికి మీ గురించి తెలిసేలా చేయవచ్చు. టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ ఇలా మీకు నచ్చిన అబ్జెక్ట్లతో HTML Code నుపయోగించి వెబ్ పేజిని నింపేయొచ్చు.
HTML నేర్చుకోవడానికి కావలసినవి:
HTML కోడింగ్ మొదలు పెట్టడానికి మీకు కేవలం రెండు అసరమవుతాయి.
- టెక్స్ట్ ను ఎడిట్ చేయగలిగే ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ (Notepad, Wordpad, Notepad++)
- HTML నేర్చుకోవాలనే తపన, ఆసక్తి
HTML నేర్చుకోవడానికి తెలుసుకోవలసినవి:
- ట్యాగ్ (Tag): వెబ్ పేజీలోని రీజన్స్ను మార్క్ చేయడానికి ట్యాగులనుపయోగిస్తారు. ఈ ట్యాగులను బ్రౌజర్ గుర్తించి రీజన్స్ లోపల ఉన్న కంటెంటును ట్యాగులకు అనుగుణంగా మార్చివేస్తుంది. ట్యాగు యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది. ఉదా: <font>
- ఎలిమెంట్ (Element): కంటెంట్కు మొదట్లో మరియు చివర్లో ఉపయోగించే ట్యాగ్ల మూలకాన్ని ఎలిమెంట్ అంటారు. ఉదా:కు <font> </font>
- ఆట్రిబ్యూట్ (Attribute): ఒక్కో ఎలిమెంట్ వివిధ రకాల విలవలతో మారుతూ ఉంటుంది. ఆ విలువను నిర్దేశించే మూలకాన్ని ఆట్రిబ్యూట్ అంటారు. ఉదా:కు <font> </font> అనే ఎలిమెంట్తో అక్షరాల స్వరూపాన్ని మార్చివేయవచ్చు. అక్షరం యొక్క సైజు మార్చడానికి ఇక్కడ size అనే ఆట్రిబ్యూట్ను ఉపయోగిస్తాము. <font size="3" > </font>
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి