వెబ్ బ్రౌజర్ సాధారణంగా ఒక HTML డాక్యుమెంటుని పైనుంచి కిందకు, ఎడమనుండి కుడికి చదివి అందులోని ట్యాగులను కనుగొని, (పేరాగ్రాపు ట్యాగులకు అనుగుణంగా కంటెంటును పేరాగ్రాపులుగా మార్చడం, టేబుల్స్ ట్యాగులకు అనుగుణంగా టేబుల్స్ ఏర్పాటు చేయడం ఇలా) ఆ ట్యాగుల ప్రకారంగా కంటెంటును ప్రచురిస్తుంది. ఒక కంప్లీటు ట్యాగును ఎలిమెంటుగా పిలుస్తాము. HTML డాక్యుమెంటుకు కలుపబడిన ట్యాగు బ్రౌజర్కు తాను ఫలానా ట్యాగునని, ఆ విధంగానే తనను ట్రీట్ చేయమని తెలియజేస్తుంది. (ఉదా:కు "హలో నేను ఒక పేరాగ్రాపు ట్యాగును. కాబట్టి నాలోని కంటెంటును పేరాగ్రాపుగా చూపించు").
ఇక నుంచి మీరు తెలుసుకోబోయే కోడ్లో వందల కొలది HTML ట్యాగులు ఉండవచ్చు. టేబుల్స్, ఇమేజెస్, లిస్టులు, ఫామ్స్ ఇంకా ఇలాంటివి అన్నీ వెబ్ పేజీలో కనపడటానికి ఒక్కోదానికి ఒకటి లేదా రెండు ట్యాగులనుపయోగించాల్సిందే. * XHTML and Dynamic HTML ప్రామాణికంగా ట్యాగులు ఉండాలంటే ఖచ్చితంగా చిన్న అక్షరాల (lower-case letters)నే ఉపయోగించాలి.
క్రింద కొన్ని ఉదాహరణలు చూడండి.
<body> వెబ్ పేజీలో డిస్ప్లే కావాలనుకునే కంటెంటు మొత్తం బాడీ ట్యాగులోనే ఉండాలి.
<p> పేరాగ్రాపు ట్యాగు </p>
<h2> హెడ్డింగు ట్యాగు </h2>
<b> బోల్డ్ ట్యాగు </b>
<i> ఇటాలిక్ ట్యాగు </i>
</body>
Singe Tags - Without closing Tags
పైన ఉపయోగించిన ట్యాగులలో ఓపెనింగు ట్యాగుకు, క్లోజింగు ట్యాగుకు మధ్యలో కంటెంటు ఉంది. కానీ కంటెంటునుపయోగించకుండా ఉపయోగించే కొన్ని ట్యాగ్స్ (Line break tags, Input Tags లాంటివి) కూడా ఉన్నాయి. వీటికి క్లోజింగు ట్యాగు ఉండదు. కానీ ఇటువంటి సింగిల్ ట్యాగ్స్లో కూడా కొన్ని ట్యాగులు (image tags) కంటెంటునుపయోగించకపోయినప్పటికీ సోర్స్ ఫైల్ యొక్క పాత్ నుపయోగించుకుంటాయి.
ఉదా:కు
Line Break Tag: <br />
Input Field Tag: <input type="text" size="14" />
Image Tag: <img src="../test.gif" />
ఇటువంటి సింగిల్ ట్యాగులను కూడా బ్రౌజర్ సమర్థవంతంగా ప్రచురించగలదు. పైన Image Tag లో ఉపయోగించిన src ఆట్రిబ్యూట్ ఆ ఇమేజి ఎక్కడ ఉందో బ్రౌజర్కు తెలియజేస్తుంది.
ఈ ట్యుటోరియల్ యొక్క ముందు భాగము:
ఈ ట్యుటోరియల్ యొక్క తర్వాతి భాగము:
ఈ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగము:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి