10, మే 2012, గురువారం

TELUGU MOVIE SONGS IN THE MEAN WHILE


ఎన్నాళ్ళనీ ఎదలో ముల్లు వేణువై వచ్చాను

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం

ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
ప్రేమ లేదని

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
ప్రియా జోహారులు

మనసు మాసిపోతే మనిషే కాదని
కటిక రాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
మోడుబారి నీడ తోడు లేకుంటిని

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ
ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం

ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము

కన్నీరుగ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము
నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము

నేనోర్వలేను తేజము
ఆర్పేయరాదా దీపము
చీకటిలో కలిసే పోయి
నా రేపటిని మరిచే పోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి మూగ గానం
ఎదుట నీవే

ఎదుట నీవే ఎదలోన నీవే
ఎదుట నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం అందుకే గాయం
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణీ కానీదు

కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా
అదే నీవు అదే నేను

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా

కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము
గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదీ లేని గానము

నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
అదే బాసగా అదే ఆశగా
అదే బాసగా అదే ఆశగా
ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను
ధనమేరా
ధనమేరా అన్నిటికి మూలం ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం

మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

..
ధనమేరా అన్నిటికి మూలం..

ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..

ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం

ధనమేరా అన్నిటికి మూలం ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం

Sunday, December 9, 2007

Kanne manasu - yE divilo virisina

దివిలో విరిసిన

దివిలో విరిసిన పారిజాతమో
కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
దివిలో విరిసిన పారిజాతమో
కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమే దివ్యదీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే

పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే

మౌనంగానే ఎదగమని

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకుంటె సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి