టాబ్లెట్లలోనూ కొన్ని లక్షల Windows అప్లికేషన్లు రన్ చేసుకునే రోజులు వచ్చేశాయి..
ముందు ఒక విషయాన్ని గమనిద్దాం..
టాబ్లెట్లని వాడడానికిఅందరూ ఎందుకు ఇష్టపడరు? ఉదా.కు.. నన్నే తీసుకుంటే ఓ 30 వేలుపెట్టి Galaxy Tabనో, ఓ 6500 పెట్టి Micromax Funbookనో కొనడానికి నాకు మనసొప్పదు. కారణం నేను రోజువారీ వాడుకునే inDesign, Photoshop, CorelDraw వంటి అప్లికేషన్లని అందులో వాడలేను.
ఇలాగే కొందరు AutoCAD వాడుతుంటారు, మరికొందరు మరో విండోస్ ప్రోగ్రామ్‌నీ వాడుతూ ఉంటారు. అవన్నీ పక్కనపెట్టి కేవలం బ్రౌజింగ్, ఇ-మెయిల్, facebook, skype, dropbox వంటి అతి పరిమితమైన అవసరాల కోసం ఓ టాబ్లెట్‌కి అంత ఖర్చుపెట్టాలంటే మీకు మనసొప్పుతుందా?
పాపం కొంతమంది ఇంతకాలం పిసికి టాబ్లెట్ ప్రత్యామ్నాయం అనుకుని కొంటూ వచ్చారు. తర్వాత పూర్తిస్థాయి పిసిలో పనిచేసేవేవీ టాబ్లెట్‌లో పనిచేయవని అర్థం అయ్యాక నిరుత్సాహపడిన వాళ్లెందరో!
ఇక అస్సలు విషయానికి వస్తే తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ స్వంతంగా టాబ్లెట్లని రూపొందించింది. 1. Microsoft Surface RT 2. Microsoft Surface Pro అనే రెండు రకాల మోడళ్లలో ఇవి లభించబోతున్నాయి. వీటిలో Microsoft Surface RT గురించి ప్రస్తుతం నేను చెప్పట్లేదు. ఎందుకంటే అది కూడా Windows Metro UI అప్లికేషన్లని మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇప్పటివరకూ మనకు అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ టాబ్లెట్లకి మించి కొత్తగా ఏమీ సాధించలేం.
Surface Pro టాబ్లెట్ మాత్రం ఇంటెల్ Core i ప్రాసెసర్‌తో పూర్తిస్థాయి Windows 8 డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. 1920×1080 Full HD రిజల్యూషన్‌ని కలిగిన 10.6 అంగుళాల స్క్రీన్‌తో ఇది లభిస్తుంది. టచ్ కవర్ కీబోర్డ్‌తో ఇతర టాబ్లెట్లకి భిన్నంగా టైప్ చెయ్యడానికి మరింత అనుకూలంగా ఇది అందుబాటులోకి వస్తోంది.
ఈ Surface Pro టాబ్లెట్ లో Intel Core i5 శ్రేణికి చెందిన ప్రాసెసర్, పూర్తిస్థాయి Windows 8 డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం ఇప్పటివరకూ కంప్యూటర్లో వాడుతూ వస్తున్న అన్ని విండోస్ సాఫ్ట్‌వేర్లనీ, గేమ్ లనూ, డాస్ అప్లికేషన్లనీ వాడుకోవచ్చు.
ఆండ్రాయిడ్ డివైజ్‌ల విషయానికే వస్తే ఇప్పటివరకూ 10 లక్షలకు లోబడే అప్లికేషన్లు లభిస్తున్నాయి.
అదే ఈ moveతో Internet Download Manager, doPDF, WinZIP, WinRAR వంటి చిన్నా చితకా అప్లికేషన్లు మొదలుకుని కొన్ని లక్షల అప్లికేషన్లని ఇప్పటికే మనం కంప్యూటర్లో వాడుతూ ఉన్నాం వాటన్నింటినీ అటు టాబ్లెట్ లోనూ వాడుకోవచ్చు.
సో నేను ఎప్పుడూ చెప్పేదే.. మనం ఇప్పటివరకూ టాబ్లెట్ల విషయంలో మొదటి తరంలోనే ఉన్నాం. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు టాబ్లెట్ల విషయంలో ఎన్నో ముందున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి