ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉన్న కంప్యూటర్లను ఇతరులు ఉపయోగించడానికి వీలు
లేకుండా పాస్వర్డ్ లను సెట్ చేయడం మనకు తెలిసిన విషయమే. రెండు
పద్ధతులనుపయోగించి ఇలా పాస్వర్డ్ లను సెట్ చేస్తుంటారు. ఒకటి: అసలు
పూర్తిగా కంప్యూటరే బూట్ కాకుండా ఉండటానికి BIOS (Basic Input/Output
System) ద్వారా పాస్వర్డ్ సెట్ చేయటం, రెండవది: కంప్యూటర్ బూట్ అయిన తర్వాత
డెస్క్ టాప్ ఓపెన్ కాకుండా ఉండటానికి Windows లోనే యూజర్ పాస్వర్డ్ సెట్
చేయటం. BIOS ద్వారా సెట్ చేయబడిన పాస్వర్డ్ లను రిమూవ్ చేయడానికి ఏ ఏ
మార్గాలన్నాయి అనే విషయం ఈ Post లో తెలుసుకుందాం. కొన్ని కంప్యూటర్లలో BIOS
మరియు కంప్యూటర్, రెండూ ఓపెన్ కాకుండా ఉండటానికి పాస్వర్డ్స్ సెట్
చేస్తుంటారు. ఇలా సెట్ చేయబడిన బయాస్ పాస్వర్డ్ లను మర్చిపోయిన సందర్భాలలో ఆ
పాస్వర్డ్ ను రీసెట్ చేయడానికి క్రింది పద్ధతులనుపయోగిస్తారు.
1. CMOS బ్యాటరీని తొలగించడం ద్వారా పాస్వర్డ్ ను రిమూవ్ చేయడం: BIOS లో మనము సేవ్ చేసే ప్రతి సెట్టింగ్ (డేట్, టైమ్, పాస్వర్డ్స్ లాంటివి) CMOS చిప్ లో అంతర్గతంగా పొందుపరచబడిన 64 బైట్స్ కెపాసిటీ కలిగిన RAM లో స్టోర్ చేయబడుతుంది. దీనినే CMOS Memory అంటాము. CMOS బ్యాటరీ ద్వారానే CMOS Memoryకి నిరంతరం సప్లై అందజేయబడుతుంది. ఈ కారణంగానే మనం కంప్యూటర్ పూర్తిగా ఆఫ్ చేసినప్పటికి డేట్ టైమ్ లాంటివి మారకుండా కరెక్ట్ టైమింగును చూపిస్తుంటాయి. ఎప్పుడైతే CMOS Memory కి సప్లై ఆగిపోతుందో ఆటోమేటిక్ గా బయాస్ కంపెనీ మొదట సెట్ చేసిన డీఫాల్ట్ సెట్టింగ్స్ లోకి మారిపోతాయి. డీఫాల్ట్ బయాస్ సెట్టింగ్స్ లో బయాస్ పాస్వర్డ్ సెట్ చేసి ఉండదు కనుక ఈ పద్ధతినుపయోగించుకొని, అంటే CMOS బ్యాటరీని తొలగించడం ద్వారా మనం బయాస్ పాస్వర్డ్ ను రిమూవ్ చేయగలము. ఇలా చేయడానికి ముందుగా మీ కంప్యూటర్ కు పవర్ సప్లై పూర్తిగా ఆఫ్ చేసి, మీ CPU క్యాబినెట్ యొక్క సైడ్ డోర్ ను తొలగించి మదర్ బోర్డ్ పై ఉన్న CMOS బ్యాటరీని బయటకు తీయండి. 15 నిముషాల తర్వాత మళ్లీ బ్యాటరీని కనెక్ట్ చేసి కంప్యూటర్ ను ఆన్ చేయండి. ఇపుడు బయాస్ పాస్వర్డ్ రిమూవ్ చేయబడి ఉంటుంది.
2. CMOS Jumper ద్వారా పాస్వర్డ్ ను రిమూవ్ చేయడం: కొన్ని మదర్ బోర్డ్స్ లో బ్యాటరీ తొలగించవలసిన అవసరం లేకుండా బయాస్ సెట్టింగ్స్ ను రీసెట్ చేయడానికి జంపర్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి ఉంటారు. సాధారణంగా ఈ జంపర్ జాక్ రెండు లేదా మూడు పిన్ లను కలిగి ఉంటుంది. మూడు పిన్ లు కలిగి ఉన్న జాక్ లో మధ్య పిన్ నుండి ఏదో ఒక పిన్ కు జంపర్ ప్లగ్ ఉంటుంది. ఈ జంపర్ ప్లగ్ ను బయటకు తీసి మధ్య పిన్ నుండి ఖాళీగా ఉన్న పిన్ కు కనెక్ట్ చేస్తే చాలు, బయాస్ సెట్టింగ్స్ అన్నీ డీఫాల్ట్ సెట్టింగ్స్ లోకి మారిపోతాయి. అదే రెండు పిన్నుల జాక్ అయితే ఆ రెండు పిన్నులను స్క్రూడ్రైవర్ లాంటి పరికరంతో కొద్ది సమయం షార్ట్ (ఒకదానికి ఒకటి కలపడం) చేస్తే చాలు.
3. కంపెనీ వారి బ్యాక్ డోర్ పాస్వర్డ్ లనుపయోగించి బయాస్ సెట్టింగ్స్ లోకి వెళ్లడం: ప్రతి కంపెనీ వారు తాము తయారు చేసిన ఎలక్ట్రానిక్ డివైజ్ లను సర్వీస్ చేయడానికి వారికంటూ కొన్ని ప్రత్యేక ఫంక్షన్స్ ను ఆ డివైజ్ లలో ముందుగానే ఏర్పరుచుకుంటారు. (ఉదా:కు టీవీ రిమోట్ లో ఏదో ఒక బటన్ ను 10 సెకండ్ల పాటు హోల్డ్ చేసి ఉంచితే మీ టీవీలో కొత్త మెనూ ప్రత్యక్షమవుతుంది. ఇలాంటివన్నీ కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ మెన్స్ సులభంగా సెట్టింగ్స్ మార్చుకోవడానికి ముందుగా ఏర్పాటు చేసిన కొన్ని ఫంక్షన్స్) అలాగే ప్రతి కంపెనీ బయాస్ కు కూడా ఒక బ్యాక్ డోర్ పాస్వర్డ్ ఉంటుంది. అంటే మనకు యూజర్ సెట్ చేసిన బయాస్ పాస్వర్డ్ తెలియకపోయినప్పటికీ ఈ బ్యాక్ డోర్ పాస్వర్డ్ ద్వారా డైరెక్ట్ యాక్సెస్ చేయగలము. అలాంటి కొన్ని కంపెనీలకు చెందిన బ్యాక్ డోర్ పాస్వర్డ్ లిస్ట్ క్రింద చూడండి.
AMI BIOS Backdoor Passwords:
Award BIOS Backdoor Passwords:
Phoenix Backdoor BIOS Passwords:
Other Manufcaturers Backdoor Pass:
(manufacturer name – password)
4. విండోస్ నుండి బయాస్ పాస్వర్డ్ ను రిమూవ్ చేయడం: ఒకవేళ మీ కంప్యూటర్ ఆల్రెడీ విండోస్ తో ఓపెన్ చేయబడి ఉంటే ఈ క్రింది సాఫ్ట్వేర్ల ద్వారా సులభంగా మీరు బయాస్ పాస్వర్డ్ ను రీసెట్ చేయవచ్చు.
- మదర్ బోర్డ్ పై ఉన్న CMOS (Complementary Metal Oxide Semiconductor) బ్యాటరీని తొలగించి కొద్ది సమయం బయట ఉంచడం వలన బయాస్ మెమొరీలో నిల్వ ఉంచబడిన మొత్తం సమాచారం ఎరేజ్ చేయబడి డీఫాల్ట్ సెట్టింగ్స్ లోకి మారిపోవడం.
- మదర్ బోర్డ్ పై ఉన్న CLR CMOS అనే జంపర్ ను (మదర్ బోర్డ్ కంపెనీని బట్టి సెట్టింగ్స్ ను అనుసరించి )షార్ట్ చేయడం లేదా ఓపెన్ చేయడం.
- మదర్ బోర్డ్ కంపెనీ వారు ఉపయోగించే బ్యాక్ డోర్ బయాస్ పాస్వర్డ్స్ నుపయోగించడం ద్వారా బయాస్ లోకి ప్రవేశించడం.
- కంప్యూటర్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నపుడు దాస్ కమాండ్స్ నుపయోగించి కానీ,
లేదా బయాస్ లను రీసెట్ చేయగలిగే సాఫ్ట్వేర్లనుపయోగించి కానీ బయాస్
పాస్వర్డ్ ను తొలగించడం.
1. CMOS బ్యాటరీని తొలగించడం ద్వారా పాస్వర్డ్ ను రిమూవ్ చేయడం: BIOS లో మనము సేవ్ చేసే ప్రతి సెట్టింగ్ (డేట్, టైమ్, పాస్వర్డ్స్ లాంటివి) CMOS చిప్ లో అంతర్గతంగా పొందుపరచబడిన 64 బైట్స్ కెపాసిటీ కలిగిన RAM లో స్టోర్ చేయబడుతుంది. దీనినే CMOS Memory అంటాము. CMOS బ్యాటరీ ద్వారానే CMOS Memoryకి నిరంతరం సప్లై అందజేయబడుతుంది. ఈ కారణంగానే మనం కంప్యూటర్ పూర్తిగా ఆఫ్ చేసినప్పటికి డేట్ టైమ్ లాంటివి మారకుండా కరెక్ట్ టైమింగును చూపిస్తుంటాయి. ఎప్పుడైతే CMOS Memory కి సప్లై ఆగిపోతుందో ఆటోమేటిక్ గా బయాస్ కంపెనీ మొదట సెట్ చేసిన డీఫాల్ట్ సెట్టింగ్స్ లోకి మారిపోతాయి. డీఫాల్ట్ బయాస్ సెట్టింగ్స్ లో బయాస్ పాస్వర్డ్ సెట్ చేసి ఉండదు కనుక ఈ పద్ధతినుపయోగించుకొని, అంటే CMOS బ్యాటరీని తొలగించడం ద్వారా మనం బయాస్ పాస్వర్డ్ ను రిమూవ్ చేయగలము. ఇలా చేయడానికి ముందుగా మీ కంప్యూటర్ కు పవర్ సప్లై పూర్తిగా ఆఫ్ చేసి, మీ CPU క్యాబినెట్ యొక్క సైడ్ డోర్ ను తొలగించి మదర్ బోర్డ్ పై ఉన్న CMOS బ్యాటరీని బయటకు తీయండి. 15 నిముషాల తర్వాత మళ్లీ బ్యాటరీని కనెక్ట్ చేసి కంప్యూటర్ ను ఆన్ చేయండి. ఇపుడు బయాస్ పాస్వర్డ్ రిమూవ్ చేయబడి ఉంటుంది.
2. CMOS Jumper ద్వారా పాస్వర్డ్ ను రిమూవ్ చేయడం: కొన్ని మదర్ బోర్డ్స్ లో బ్యాటరీ తొలగించవలసిన అవసరం లేకుండా బయాస్ సెట్టింగ్స్ ను రీసెట్ చేయడానికి జంపర్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి ఉంటారు. సాధారణంగా ఈ జంపర్ జాక్ రెండు లేదా మూడు పిన్ లను కలిగి ఉంటుంది. మూడు పిన్ లు కలిగి ఉన్న జాక్ లో మధ్య పిన్ నుండి ఏదో ఒక పిన్ కు జంపర్ ప్లగ్ ఉంటుంది. ఈ జంపర్ ప్లగ్ ను బయటకు తీసి మధ్య పిన్ నుండి ఖాళీగా ఉన్న పిన్ కు కనెక్ట్ చేస్తే చాలు, బయాస్ సెట్టింగ్స్ అన్నీ డీఫాల్ట్ సెట్టింగ్స్ లోకి మారిపోతాయి. అదే రెండు పిన్నుల జాక్ అయితే ఆ రెండు పిన్నులను స్క్రూడ్రైవర్ లాంటి పరికరంతో కొద్ది సమయం షార్ట్ (ఒకదానికి ఒకటి కలపడం) చేస్తే చాలు.
3. కంపెనీ వారి బ్యాక్ డోర్ పాస్వర్డ్ లనుపయోగించి బయాస్ సెట్టింగ్స్ లోకి వెళ్లడం: ప్రతి కంపెనీ వారు తాము తయారు చేసిన ఎలక్ట్రానిక్ డివైజ్ లను సర్వీస్ చేయడానికి వారికంటూ కొన్ని ప్రత్యేక ఫంక్షన్స్ ను ఆ డివైజ్ లలో ముందుగానే ఏర్పరుచుకుంటారు. (ఉదా:కు టీవీ రిమోట్ లో ఏదో ఒక బటన్ ను 10 సెకండ్ల పాటు హోల్డ్ చేసి ఉంచితే మీ టీవీలో కొత్త మెనూ ప్రత్యక్షమవుతుంది. ఇలాంటివన్నీ కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ మెన్స్ సులభంగా సెట్టింగ్స్ మార్చుకోవడానికి ముందుగా ఏర్పాటు చేసిన కొన్ని ఫంక్షన్స్) అలాగే ప్రతి కంపెనీ బయాస్ కు కూడా ఒక బ్యాక్ డోర్ పాస్వర్డ్ ఉంటుంది. అంటే మనకు యూజర్ సెట్ చేసిన బయాస్ పాస్వర్డ్ తెలియకపోయినప్పటికీ ఈ బ్యాక్ డోర్ పాస్వర్డ్ ద్వారా డైరెక్ట్ యాక్సెస్ చేయగలము. అలాంటి కొన్ని కంపెనీలకు చెందిన బ్యాక్ డోర్ పాస్వర్డ్ లిస్ట్ క్రింద చూడండి.
AMI BIOS Backdoor Passwords:
- A.M.I.
- AAAMMMII
- AMI
- AMI?SW
- AMI_SW
- BIOS
- CONDO
- HEWITT RAND
- LKWPETER
- MI
- Oder
- PASSWORD
Award BIOS Backdoor Passwords:
- (eight spaces)
- 01322222
- 589589
- 589721
- 595595
- 598598
- ALFAROME
- ALLY
- ALLy
- aLLY
- aLLy
- aPAf
- award
- AWARD PW
- AWARD SW
- AWARD?SW
- AWARD_PW
- AWARD_SW
- AWKWARD
- awkward
- IOSTAR
- CONCAT
- CONDO
- Condo
- condo
- d8on
- djonet
- HLT
- J256
- J262
- j262
- j322
- j332
- J64
- KDD
- LKWPETER
- Lkwpeter
- PINT
- pint
- SER
- SKY_FOXSYXZ
- SKY_FOX
- syxz
- SYXZ
- TTPTHA
- ZAAAADA
- ZAAADA
- ZBAAACA
- ZJAAADC
Phoenix Backdoor BIOS Passwords:
- BIOS
- CMOS
- phoenix
- PHOENIX
Other Manufcaturers Backdoor Pass:
(manufacturer name – password)
- VOBIS and IBM – merlin
- Dell – Dell
- Biostar – Biostar
- Compaq – Compaq
- Enox – xo11nE
- Epox – central
- Freetech – Posterie
- IWill – iwill
- Jetway – spooml
- Packard Bell – bell9
- QDI – QDI
- Siemens – SKY_FOX
- SOYO – SY_MB
- TMC – BIGO
- Toshiba – Toshiba
4. విండోస్ నుండి బయాస్ పాస్వర్డ్ ను రిమూవ్ చేయడం: ఒకవేళ మీ కంప్యూటర్ ఆల్రెడీ విండోస్ తో ఓపెన్ చేయబడి ఉంటే ఈ క్రింది సాఫ్ట్వేర్ల ద్వారా సులభంగా మీరు బయాస్ పాస్వర్డ్ ను రీసెట్ చేయవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి