మొదట మీ దగ్గర ఉన్న విండోస్ ఎక్స్ పీ సీడీని Cd Drive లో
పెట్టండి.తరువాత మీ సిస్టంని రీస్టార్ట్ చేసి సిస్టం స్టార్టప్ లో మీ మదర్
బోర్డ్ ని బట్టీ F2 లేదా Del కీలను ప్రెస్ చేసి BIOS menu లోకి ఎంటర్ అయ్యి
బూట్ మెనూలో first boot device గా సీడి రామ్ ని సెట్ చేసి సేవ్
చెయ్యండి.వెంటనే మీరు చేసిన సెట్టింగులు సేవ్ చేయబడి మీ సిస్టం రీస్టార్ట్
చేయబడుతుంది. తరువాత విధానాన్ని స్టెప్ బై స్టెప్ గా వివరంగా చూడండి. పైన
చెప్పిన అన్ని సెట్టింగులూ పూర్తయి రీస్టార్ట్ అయ్యి స్టార్టప్ లో ఈ క్రింద
చూపిన విధంగా press any - to boot from cd అని అలర్ట్ వస్తుంది.వెంటనే
మీరు కీబోర్డ్ లోని ఏదైనా కీని ప్రెస్ చెయ్యండి.
వెంటనే క్రింద చూపిన విధంగా set up is inspecing your computer's hardware configaration అని వస్తుంది.
దాదాపుగా వెంటనే ఈ క్రింద చూపిన విధంగా Windows setup అని వచ్చి కొన్ని ఫైళ్లను ఆటోమేటిక్ గా మీ సిస్టంలోకి లోడ్ చేస్తుంది.
కొంత సేపటికి విండోస్ ఫైళ్ళను కాపీ చేయడం పూర్తయిన తరువాత ఈ క్రింద పటంలో చూపిన విధంగా xp ని ఏ రకంగా ఇన్ స్టాల్ చెయ్యాలో అడుగుతుంది.మనకి ఫ్రెష్ గా ఎక్స్ పీ ఇన్ స్టాల్ కావాలి కాబట్టి తెరపట్టు అడుగున సూచించిన విధంగా కీ బోర్డ్ మీద ఉండే ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.
తరువాత క్రింద తెరపట్టు లోని విధంగా స్క్రీన్ ప్రత్యక్షమై లైసెన్స్ అగ్రిమెంట్ ని చూపిస్తుంది.అప్పుడు F8 ప్రెస్ చెయ్యండి.
వెంటనే క్రింది విధంగా తెర ప్రత్యక్షమవుతుంది.అప్పుడు కీ బోర్డ్ మీద ఉండే ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.కొన్ని సార్లు windows has detected previous version of windows అనే అలర్ట్ వస్తుంది.ఇలా ఎందుకు వస్తుందంటే ఒకవేళ ఇదివరకే మీ కంప్యూటర్ లో విండోస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ స్టాల్ అయి ఉండటం.అలా వచ్చినప్పుడు సింపుల్ గా కీ బోర్డ్ మీద Esc కీని ప్రెస్ చెయ్యండి.
తరువాత క్రింద చూపిన విధంగా మీ హార్డ్ డిస్క్ లోని పార్టీషన్ లను,అన్ పార్టీషన్డ్ స్పేస్ ని చూపిస్తుంది.నా దగ్గర 4 జీబీ హార్డ్ డిస్క్ ఉంది.క్రింద గమనించండి దానిలో నా హార్డ్ డిస్క్ పార్టీషన్ ఇంకా చెయ్యలేదు.
కొత్త పార్టీషన్ ని క్రియేట్ చెయ్యాలంటే c ప్రెస్ చెయ్యండి.వెంటనే ఈ క్రింది విధంగా వస్తుంది.అప్పుడు అక్కడ మీ పార్టీషన్ ఎంత ఉండాలో Mega Byte లలో ఎంటర్ చేసి కీ బోర్డ్ మీద ఉండే ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.
వెంటనే ఈ క్రింది విధంగా పార్టీషన్ ప్రత్యక్షమవుతుంది.
తరువాత ఆ పార్టీషన్ హైలైట్ అయ్యేలా చేసి తరువాత కీబోర్డ్ లోని ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.అప్పుడు వెంటనే ఈ క్రింది విధంగా స్క్రీన్ ప్రత్యక్షమౌతుంది.
అప్పుడు పైన చూపిన విధంగా format the partition using NTFS file system హైలైట్ చేసి ఎంటర్ చెయ్యండి. తరువాత ఈ క్రింద స్క్రీన్ లో చూపినట్లు వస్తుంది.అప్పుడు కీబోర్డ్ లోని ఎంటర్ కీని ప్రెస్ చెయ్యండి.మరొక విషయం ఏమిటంటే ఈ ఒక్క స్క్రీన్ షాట్ మాత్రం కొన్ని వెర్షన్లలో రావచ్చు రాకపోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు.ఇది విండోస్ ఎక్స్ పీ హోమ్ లో ఉంది ప్రీమియమ్ వెర్షన్ లో లేదు.
తరువాత క్రింది విధంగా set up is formatting అని వస్తుంది.
ఫార్మాట్ చెయ్యడం పూర్తయిన తరువాత ఒక క్షణం లో set up is copying files అని వస్తుంది.
సెటప్ కావలసిన ఫైళ్ళన్నీ లోడ్ చేసుకున్న తరువాత ఈ రకంగా స్క్రీన్ ప్రత్యక్షం అవుతుంది.
చివరగా క్రింది విధంగా స్క్రీన్ వచ్చి సిస్టం ఆటోమేటిక్ గా పదిహేను సెకండ్లలో రీస్టార్ట్ అవుతుంది.అప్పుడు ఎంటర్ చేస్తే వెయిట్ చేసే పనిలేకుండా వెంటనే రీస్టార్ట్ అవుతుంది.
తరువాత ఈ క్రింది విధంగా బూట్ స్క్రీన్ కనిపిస్తుంది.
కొంతసేపటి తరువాత ఈ క్రింద విధంగా ఇన్ స్టాలేషన్ ప్రోసెస్ స్టార్ట్ అవుతుంది.
కొంతసేపటి తరువాత Regional and Language Options అని ఒక విండో ఓపెన్ అవుతుంది.అప్పుడు వెంటనే Next పై క్లిక్ చెయ్యండి.
తరువాత వచ్చే విండోలో Name బాక్స్ లో మీ పేరు ఎంటర్ చెయ్యండి.ఆర్గనైజేషన్ అన్న చోట ఏమీ టైప్ చెయ్యకపోయినా పర్వాలేదు.తరువాత Next ని క్లిక్ చెయ్యండి.
తరువాత విండోలో ప్రోడక్ట్ కీని ఎంటర్ చెయ్యండి.
తరువాత మీ కంప్యూటర్ పేరు ఎంటర్ చెయ్యండి.
తరువాత వచ్చే స్క్రీన్ లో Date and Time Settings మీ ఇష్టం వచ్చినట్లు సెట్ చేసుకొని Next పై క్లిక్ చెయ్యండి.
ఒక అరగంట లోపు ఇన్ స్టలేషన్ పూర్తి అవుతుంది.అప్పుడు సిస్టం ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతుంది.
తరువాత కొన్ని సెట్టింగ్స్ మరియూ యూజర్ నేమ్స్ ఇవ్వవలసి ఉంటుంది.అవసరాన్ని బట్టీ అవన్నీ పూర్తి చేసి చివరగా కనబడే ఫినిష్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ విండోస్ ఎక్స్ పీ మీ సేవకు సిద్దం. Note :- ఇక్కడ చూపించినది విండోస్ హోమ్ వెర్షన్ కి సంభందించిన స్క్రీన్ షాట్స్.ఇక్కడ చూపించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ప్రీమియం వెర్షన్ లో ఉండవు నేరుగా తరువాతి స్టెప్ లోకి ఎంటర్ అవుతాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి