16, డిసెంబర్ 2012, ఆదివారం

Mee secrete file ni dachukovataniki Best trick



మీ సీక్రెట్ ఫైల్స్ ను ఎవరూ సులభంగా గుర్తుపట్టకుండా ఏ ఫార్మాట్ లో ఉన్న ఫైల్ నైనా ఇమేజి రూపంలోకి మార్చి పెట్టకోవడానికి ఈ ట్రిక్ చాలా వరకు ఉపయోగపడుతుంది. మరి మీ ఫైల్స్ ను ఇమేజిలుగా ఎలా మార్చాలో తెలుసుకుందామా. ఇలా చేయడానికి ఏదో ఒక ఇమేజి ఫైల్ అవసరమవుతుంది. క్రింద గమనించండి. ఈ రెండు ఫైల్స్ లో ఇపుడు ram.swf ను మనము హైడ్ చేద్దాము. మరి ram.swf ను హైడ్ చేయడానికి ఏదో ఒక ఇమేజి ఫైల్ అవసరమవుతుంది కదా? క్రింద ఉన్న bg.jpg ని ఇక్కడ ఇమేజి ఫైల్ లాగా వాడుదాము.
[Image: 01.jpg]

1. మొదట ram.swf ఫైల్ ను క్రింద చూపిన విధంగా ram.rar ఫైల్ గా మార్చండి.

[Image: 02.jpg]
[Image: 03.jpg]


2. Start మెనూలో Run ను క్లిక్ చేయండి.

[Image: 04.jpg]


3. Run డైలాగ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.

[Image: 05.jpg]


4. ఇపుడు cd\ అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.

[Image: 06.jpg]


5. వెంటనే copy /b bg.jpg + ram.rar new.jpg అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి. (ఇక్కడ new.jpg అంటే మనము కొత్తగా ram.rar దాచి పెట్టడానికి ఇమేజ్ ఫైల్ ను క్రియేట్ చేస్తున్నాము కదా..అదే new.jpg)

[Image: 07.jpg]

[Image: 08.jpg]

చూశారా ..new.jpg ఫైల్ ను..
ram.rar ఫైల్ new.jpg గా మారిపోయిందన్నమాట.. ఇక మీ కంప్యూటర్లో ఎవరు ఆ ఫైల్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా కూడా అందులోని ఇమేజి మాత్రమే ఓపెన్ అవుతుంది.
[Image: 09.jpg]

మరి new.jpg ఫైల్ ను తిరిగి ram.rar గా మార్చడం ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్...new.jpg ని ram.rar గా రీనేమ్ చేయడమే..రీనేమ్ చేసిన వెంటనే మీ ram.rar ఫైల్ లో అంతకు ముందు ఏ ఫైల్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి....ఇలా ఇమేజి వెనుక మీ ఫైల్స్ ను హైడ్ చయాలంటే ముందుగా ఆ ఫైల్స్ ను rar ఫైల్స్ గా మార్చుకోండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి